అస్వస్థతకు గురైన సునీల్‌

ప్రముఖ హాస్యనటుడు, కథానాయకుడు సునీల్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం గురువారం ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. గొంతు ఇన్‌ఫెక్షన్, వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల నీరసించారని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఇటీవలే ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారాయన. ప్రస్తుతం ‘కలర్‌ఫొటో’ అనే చిత్రంలో ప్రతినాయకుడుగా నటిస్తున్నారు. మరోవైపు రవితేజ కథానాయకుడుగా వస్తున్న ‘డిస్కోరాజా’లో ఓ కీలక పాత్ర పోషించారు సునీల్‌. ఈ నెల 24 విడుదల కానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.