పదేళ్లకు మళ్లీ?

‘మర్యాద రామన్న’ చిత్రంతో హిట్‌ పెయిర్‌ అనిపించుకున్నారు సునీల్‌, సలోని. రాజమౌళి దర్శకత్వంలో 2010లో ప్రేక్షకుల ముందుకొచ్చిందా సినిమా. మళ్లీ ఇన్నేళ్లకు ఈ జోడీ కలిసి నటిస్తున్నారని తాజా సమాచారం. ప్రేమకథలు తెరకెక్కించడంలో విశేష అనుభవం ఉన్న దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య మరో ప్రేమ కహానీ చూపించేందుకు సిద్ధమయ్యారని టాక్‌. ఈ కథలోని పాత్రకు సలోని అయితే బావుంటుందని, తను మాత్రమే న్యాయం చేయగలదని భావించి నాయిక అవకాశం ఇచ్చారట. వీళ్ల కాంబినేషన్‌ని దృష్టిలో పెట్టుకుని మంచి లవ్‌స్టోరీ చూపించబోతున్నారని వినికిడి. అంతేకాదు ఇప్పటికే చిత్రీకరణ కూడా ప్రారంభించారని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్‌. మరి ఈ జంట మరోసారి ఎలా ఆకట్టుకుంటారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.