పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో?

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి .. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించనున్నారా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అతిథి పాత్ర కోసం సునీల్‌ని సంప్రదించారని టాక్‌. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఫైటర్‌’ వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటుంది. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ రూపొందుతందీ చిత్రం. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం సునీల్‌ శెట్టిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట పూరి. చర్చల అనంతరం త్వరలోనే స్పష్టత రావచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా విజయ్‌ దేవరకొండ, సునీల్‌ శెట్టి ఒకే స్ర్కీన్‌పై కనిపిస్తే సినీ అభిమానులకు పండగే . పీసీ కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, చార్మి నిర్మిస్తున్నారు. విజయ్‌ సరసన బాలీవుడ్‌ భామ అనన్య పాండే ఆడిపాడుతోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.