సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌?

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ బాలనటుడిగా రంగప్రవేశం చేసి మెప్పించారు. ప్రస్తుతం కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డితో కలిసి అఖిల్‌ సినిమా చేయనున్నాడనే వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. సురేందర్‌ ఇప్పటికే అఖిల్‌కి కథను వినిపించాడట. ఈ కథ అఖిల్‌ కూడా నచ్చడంతో సురేందర్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. త్వరలోనే సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడి కావచ్చని చెప్పుకుంటున్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి - చిరంజీవితో కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా తరువాత ఆయన ఏ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన దాఖలు లేవు. మొత్తం మీద కరోనా వైరస్‌ పరిస్థితులు చక్కబడితే ఈ కొత్త చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.