మరో మ్యాజిక్‌ కాంబినేషన్‌..

‘రేసుగుర్రం’ చిత్రంతో ఇటు మాస్‌ ప్రేక్షకులతో పాటు క్లాస్‌ సినీప్రియులతోనూ థియేటర్లలో విజిల్స్‌ కొట్టించారు హీరో అల్లు అర్జున్‌ - దర్శకుడు సురేందర్‌ రెడ్డి. ఇప్పుడీ మ్యాజిక్‌ కలయికలోనే మరో కొత్త చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. సురేందర్‌ ప్రస్తుతం దర్శక రచయిత వక్కంతం వంశీతో కలిసి బన్నికి ఓ అదిరిపోయే కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘రేసుగుర్రం’కు కథను అందించింది కూడా వంశీనే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో బన్ని కోసం పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయిస్తున్నారట ఆయన. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘పుష్ప’, ‘ఐకాన్‌’ చిత్రాలు పూర్తయిన వెంటనే అల్లు అర్జున్‌తో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట సురేందర్‌ రెడ్డి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.