మరో బయోపిక్‌లో సూర్య?

సుధా కొంగర దర్శకత్వంలో ఓ బయోపిక్‌లో నటిస్తున్నాడు తమిళ నటుడు సూర్య. డెక్కన్‌ ఎయిర్‌వేస్‌ అధినేత గోపీనాథ్‌ జీవితాధారంగా ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతోపాటు మరో బయోపిక్‌లోనూ సూర్య నటించే అవకాశాలున్నాయని కోలీవుడ్‌ సమాచారం. అయితే ఎవరి బయోపిక్‌ అనేది తెలియాల్సి ఉంది. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందునుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు సూర్యకు కథ వినిపించాడని, సూర్య పచ్చ జండా ఊపే ఆలోచనలో ఉన్నాడని వినిపిస్తోంది. త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు హరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు సూర్య. అనంతరం శివ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.