సుశాంత్‌ వచ్చేశాడు

ఇస్త్రీ చొక్కా, టై, వాచ్‌ పెట్టుకున్న సుశాంత్‌ను చూస్తుంటే ‘సాఫ్ట్‌’వేర్‌ కుర్రాడిలా కనిపిస్తున్నాడు కదూ! ఇంత చక్కగా సిద్ధమై ఫేస్‌ రైట్‌ టర్నింగ్‌ ఇచ్చి చిరునవ్వు చిందిస్తుంది ఎందుకనుకుంటున్నారు? ‘అల వైకుంఠపురములో’ సుశాంత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఆయన పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఇది. రాజ్‌ అనే క్యారెక్టర్‌లో దర్శనమివ్వబోతున్నాడు సుశాంత్‌. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వెండితెరపై ఎలా అలరిస్తాడో తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే. సాయంత్రం మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది చిత్రబృందం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతాఆర్ట్ష్స్‌ సంయుక్త నిర్మాణంలో తివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల కానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.