సుశాంత్‌ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలి: శేఖర్‌ సుమన్‌


బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని బంధుప్రీతే కారణమనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. దీనిపై అంతర్జాలంలో చర్చలు కూడా నడుస్తున్నాయి. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటనేది పోలీసులకు ఇంకా స్పష్టంగా ఏమీ తెలియదు. ఇక బాలీవుడ్‌కే చెందిన నటులు శేఖర్‌ సుమన్‌, తరుణ్‌ ఖన్నాలైతే దీనిపై ఏకంగా సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై శేఖర్‌ సుమన్‌ తన ట్విట్టర్‌ వేదికగా..‘‘ప్రస్తుతం సుశాంత్‌ మరణంపై కుటుంబ మద్దతు లేదు, రాజీకీయ మద్దతు లేదు. మన చుట్టూ జరుగుతున్న విషయాలేవి అనుకూలంగా లేవు. మూడు వారాలు గడిచినా కూడా సుశాంత్‌ విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. సుశాంత్‌ మరణవార్త ఇక సజీవంగానే ఉంచాం. జస్టీస్‌ ఫర్ సుశాంత్‌ అనేది బాహుశా పెద్ద ఉద్యమంగా మారుతోందని..’’ పేర్కొన్నారు. మరోనటుడు తరుణ్‌ ఖాన్నా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ..’’సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై కచ్చితంగా సీబీఐ దర్యాప్తు చేయాల్సిందే ..’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న సుశాంత్‌ సింగ్‌ మరణంపై సామాజిక మాధ్యమాల్లో మాత్రం అలజడి తగ్గడం లేదు. మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీపై కేసులను నమోదు చేయాలని కోరుతూ స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా పిటిషన్‌ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని బీహార్‌ కోర్టు బుధవారం కొట్టివేసింది.  

View this post on Instagram

A post shared by Tarun Khanna (@tarunkhanna23.tk) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.