కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన తమన్నా

తెలుగు కథానాయిక తమన్నా తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మిల్కీ తమన్నా కరోనా భారిన పడింది. మూడు రోజుల కిత్రం కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్‌ -19 పరీక్ష చేయించుకోగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆమె హైదరబాద్‌లోని ఓ ప్రవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో తమన్నా తల్లితండ్రులకు కరోనా వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. అప్పుడు తమన్నా తన ట్విట్టర్‌ వేదికగా విషయాన్ని తెలిపింది. తమన్నా ఈ మధ్యకాలంలో ఓ వెబ్‌సీరీస్‌ చిత్రంలో నటిస్తోంది. అటు పెద్దతెర - చిన్నితెర అనే తేడా లేకుండా ఎందరో నటీనటీనటులు సాంకేతిక సిబ్బందికి కరోనా వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. తమన్నా ఈ ఏడాది గోపీచంద్‌ కథానాయకుడిగా వస్తోన్న ‘సీటీమార్’‌ చిత్రంలో కబడ్డీ కోచ్‌ జ్వాలారెడ్డిగా నటిస్తోంది. బాలీవుడ్‌లో ‘బోలే చుడియాన్’‌లో నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న‘దటీజ్‌ మహాలక్ష్మి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.