వాళ్లే రాణిస్తారంటే నేను నమ్మను


‘‘బ్యాగ్రౌండ్‌ ఉన్న వాళ్లే చిత్ర పరిశ్రమలో రాణిస్తారన్న మాట నేను నమ్మను అంటో్ంది’’ సినీ నటి తమన్నా.  ‘‘ ఏ చిత్రసీమలో ఎదగడానికైనా బోలెడన్ని అవకాశాలున్నాయి. వాటిని మనం చక్కగా ఉపయోగించుకోవాలంతే. నేను సినీ నేపథ్యంలో పుట్టిపెరిగిన దాన్నికాదు. నా వెనక సినిమా గాడ్‌ ఫాదర్లు లేరు. కానీ, ఇన్నేళ్లుగా వరుస అవకాశాలతో నా సినీ ప్రయాణం కొనసాగించగలుగుతున్నా కదా. నేనేంటి? నాతోటి నటీమణులు సమంత, అనుష్క, కాజల్, పూజా హెగ్డే వీళ్లెవరూ.. సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు కాదు. కానీ, తమకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. ఇమేజ్‌ని సృష్టించుకున్నారు. ఇక్కడ ప్రతిభ, విజయాలే మాట్లాడతాయనడానికి మేమే నిదర్శనం’’ అని చెప్పింది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.