అలా అనిపించుకోవడం వల్లే అవకాశాలొచ్చియి

కెరీర్‌లో ఎక్కువ కమర్షియల్‌ చిత్రాలే చేస్తూ వచ్చారు. వాటితో వచ్చే గుర్తింపు తక్కువ కదా.. అని ఎప్పుడూ అనిపించలేదా?తమన్నా: ‘‘నిజానికి నేనెప్పుడూ అలా అనుకోలేదు. అసలీ అభిప్రాయంతో నేను ఏకీభవించను కూడా. వాణిజ్య ప్రధానమైన కథల్లో నాయికల పాత్రల పరిధి చాలా తక్కువ. ఆ పరిధిలోనే ప్రేక్షకుల్ని కట్టిపడేయాలి. అది చాలా కష్టమైన వ్యవహారమే. పది సన్నివేశాలు ఉన్నప్పుడు.. నాలుగు సన్నివేశాల్లోనైనా మన సత్తాని చూపించొచ్చు. కానీ, ఉన్నదే నాలుగు సన్నివేశాలైతే? వాణిజ్య ప్రధానమైన చిత్రాల్లో ఇలాంటి సవాళ్లే ఎదురవుతుంటాయి. కానీ, ఆ కాసింత పరిధిలోనే ‘తమన్నా గ్లామర్‌గా కనిపించింది. డ్యాన్స్‌ బాగా వేసింది, భలే ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది’ అనిపించుకోవాలి. నేనలా అనిపించుకున్నా కాబట్టే గుర్తింపొచ్చింది. ఆ గుర్తింపు వల్లే అవకాశాలొచ్చాయి’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.