ఇదే మా కథ అంటోన్న తాన్య హోప్‌

‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంలో కథానాయికగా నటించి అలరించిన బెంగళూరు భామ తాన్య హోప్‌. ప్రస్తుతం గురు పవన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇదే మా కథ’ (రైడర్స్ స్టోరి అనేది ఉపశీర్షిక) చిత్రంలో నటిస్తోంది. చిత్రంలో హీరో సుమంత్ అశ్విన్. తాన్య్ లాక్‌డౌన్ తరువాత ఒప్పుకున్న చిత్రం ‘ఇదే మా కథ’. చిత్ర కథంతా రోడ్‌ మార్గం నేపథ్యంలోనే సాగనుంది. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్‌ చిత్రాన్మి నిర్మిస్తున్నారు. ఇంకా చిత్రంలో శ్రీకాంత్‌, సప్తగిరి, సమీర్‌, సత్యం రాజేష్‌, శ్రీజిత ఘోష్‌, తివిక్రమ్‌ సాయి తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం సునీల్‌ కశ్యప్‌ అందిస్తుండగా, సి రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తాన్య హోప్‌ తెలుగులో జగపతిబాబుతో కలిసి ‘పటేల్‌ సర్’‌ చిత్రంలో ఏసీపీ క్యాథరిన్‌గా నటించింది. అంతకు ముందు ‘నేను శైలజ’ చిత్రంలో ‘‘నైట్‌ ఈజ్‌ స్టిల్‌ యంగ్’’‌ అనే ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది. సంపత్‌ నంది నిర్మాణంలో వచ్చిన ‘పేపర్‌ బాయ్’‌లోనూ ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ ఏడాది తెలుగులో రవితేజతో కలిసి ‘డిస్కోరాజా’లో నటించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.