తెలుగు దర్శకుడు తేజకు కరోనా!

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19). ఇప్పటికే దేశంలోని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తాజాగా దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ మధ్యే తేజ ముంబయి వెళ్లి వచ్చిన ఆయన తరువాత పరీక్షలు చేయించుకోగా, కరోనా సోకినట్లు వెల్లడైంది. దాంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయగా నెగటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే తెలుగు సినిమా అగ్రదర్శకుడు రాజమౌళి కుటుంబం కరోనా బారిన పడినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తేజ ఇప్పటికే తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి తన దృష్టంతా గోపీచంద్‌ హీరోగా వస్తున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ, మరొక చిత్రం కథానాయకుడు రానాతో తెరకెక్కించనున్నారు. తేజ కరోనా రాకుకుండా ఉండాలంటే బయటకు వెళ్లినప్పుడు శానిటైజర్‌ చేతులను శుభ్రపరచుకొని, ఇంటికొచ్చాక తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలుమార్లు సామాజిక మాధ్యమాల్లో జాగ్రత్తలను సైతం సూచించారు. తేజ గత ఏడాది బెల్లంకొండ హీరోగా ‘సీత’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కాజల్‌ కథానాయికగా నటించింది. సోనూ సూద్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.