‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో కొత్త పాట ఇదిగో
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ రాజకీయ-వ్యక్తిగత జీవితం ఆధారంగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ ను ఫిబ్రవరి 14న ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తానని ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో ‘దోపిడిదారుల పెత్తనమే ఇక వద్దని చిత్తుగా పడగొడతా’ అంటూ హైవోల్టేజీతో సాగే పాట క్లిప్‌ ను ఈరోజు వర్మ విడుదల చేశారు.ప్రముఖ నటుడు సాయికుమార్‌ సోదరుడు, ఢమరుకం సినిమాలో విలన్‌ గా నటించిన బొమ్మాళి రవిశంకర్‌ ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా వర్మ ట్విట్టర్లో స్పందిస్తూ..‘రవిశంకర్‌.. నీ గొంతులోని పవర్‌ స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు కూడా వినిపిస్తుంది’ అని ప్రశంసించారు. ఈ పాటను సిరాశ్రీ రాయగా, కల్యాణీమాలిక్‌ సంగీతం అందించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.