తమన్‌ రాకతో ‘పింక్‌’పై క్లారిటీ
టాలీవుడ్‌లో అధికంగా చర్చించుకున్న చిత్రం ‘పింక్‌’. అగ్ర నటుడు పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటంతో సినీ ప్రియుల్లో అంచనాలు పెరిగాయి. హిందీలో అమితాబ్‌ నటించిన చిత్రమిది. తెలుగులో దర్శకుడు వేణు శ్రీరామ్‌ రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు గురించి కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. మరోవైపు పవన్‌ రాజకీయాలతో బిజీ ఉంటున్నారు, చిత్రీకరణకు సమయం పడుతుందంటూ రకరకాల వార్తలొచ్చాయి. ఇందులో నిజం లేదని తేలిపోయింది. వీటన్నింటికి చిత్రబృందం అడ్డుకట్ట వేసింది. సంగీత దర్శకుడు తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అధికారికంగా ప్రకటించడంతో తెలుగు ‘పింక్‌’పై స్పష్టత వచ్చింది. అంతేకాదు మీడియా ప్రమేయం లేకుండా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారని తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి పవన్‌ సెట్స్‌లో అడుగుపెడుతున్నట్లు సమాచారం. 20రోజల డేట్స్‌ మాత్రమే ఇచ్చారట. పవన్‌ సరసన కథానాయిక నివేదా థామస్‌ అని ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.