మరో ‘తుపాకీ’ సిద్ధమవుతోంది..

తమిళ అగ్ర హీరో విజయ్‌ దళపతితో మరోసారి తుపాకీ చేతబట్టించబోతున్నారు దర్శకుడు మురగదాస్‌. ప్రస్తుతం ఈ స్టార్‌ హీరో దర్శకుడు లోకేష్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో ‘మాస్టర్‌’ చేస్తోన్న సంగతి తెలిసిందే. వేసవి కానుకగా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది పూర్తయిన వెంçనే విజయ్‌ తన 65వ చిత్రాన్ని సుధ కొంగర దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, దీని పూర్వ నిర్మాణ పనులకే చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును కాస్త వెనక్కు జరిపారట దళపతి. ఇప్పుడీ అవకాశాన్నే మురగదాస్‌కు అప్పజెప్పినట్లు సమాచారం. వీళ్లిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘తుపాకీ’ మంచి విజయాన్ని అందుకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ తాజా ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ విషయమై ఇద్దరి మధ్య చర్చలు కూడా పూర్తయ్యాయని, దీనికి విజయ్‌ కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.