చెల్లెలు పాత్రలో త్రిష!

‘వర్షం’, ‘అతడు’, ‘నమో వెంకటేశ’లాంటి చిత్రాల్లో కథానాయికగా నటించి అలరించింది త్రిష. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో కుందవై అనే పాత్ర పోషిస్తుంది. అయితే ఇందులో నటుడు జయం రవికి చెల్లెలుగా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. గతంలో జయం రవి, త్రిషల కాంబినేషన్లలో హీరోహీరోయిన్లగా కొన్ని సినిమా వచ్చాయి. అందులో కొన్ని ‘సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌’, ‘సకలకళా వల్లభన్‌’లాంటి చిత్రాలు ఉన్నాయి. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కుతున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాసు టాకీస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో ఇంకా విక్రమ్, ఐశ్వర్యరాయ్, మోహన్‌బాబు, వరలక్ష్మి శరత్‌ కుమార్, విక్రమ్‌ ప్రభు, అదితిరావు హైదరీ తదితరులు నటిస్తున్నారు. భారీ తారాగణంతో, రెండు భాగాలుగా తెరకెక్కనున్న సినిమాకి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సంగీతం అందిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.