బన్నీ - త్రివిక్రమ్‌ సినిమా పేరేంటంటే?

త్రివిక్ర‌మ్ - అల్లు అర్జున్ క‌ల‌యిక‌లో మూడో చిత్రం తెర‌కెక్కుతోంది. విజ‌య‌వంత‌మైన `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్యమూర్తి` త‌ర్వాత ఈ ఇద్ద‌రూ కలిసి చేస్తున్న ఆ సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఈనెల 24 నుంచి చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. పూజా హేగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి `అల‌క‌నంద‌` అనే పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. మొద‌ట్లో `నాన్న నేను`తోపాటు... ప‌లు పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. తాజాగా `అల‌క‌నంద‌` అనే పేరు గురించి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌తో క‌లిసి గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ట‌బుతోపాటు... సుశాంత్‌, సునీల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.