సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న ‘కబ్జా’ షూటింగ్

‘ఎ’ చిత్రం నటుడు ఉపేంద్ర కథానాయకుడిగా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్‌.చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమానికి లగడపాటి శ్రీధర్‌ సమర్పకుడు. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఆర్‌.చంద్రశేఖర్, రాజ్‌ప్రభాకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా అంతా 1947-1980 నేపథ్యంలో సాగే ఒక మాఫియా నాయకుడి కథ ఇది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా వైరస్‌తో వాయిదా పడిన సంగతి తెలిసిందే. చిత్రాన్ని సెప్టెంబర్లో తిరిగి ప్రారంభించనున్నారు. అయితే చిత్రంలో కథానాయిక ఎవరనేది ఇంకా తెలియదు. సినిమా గురించి దర్శకుడు చంద్రు  స్పందిస్తూ..‘‘ఈ చిత్రం కోసం మినర్వా మిల్స్‌లో భారీ జైలు ఏర్పాటుతో చేశాం. అక్కడ భారీ యాక్షన్ బ్లాక్ సీక్వెన్స్ షూటింగ్ ప్రారంభించాం. తరువాత కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్న అవుతున్నాం. మేం కనీసం 20 రోజుల పాటు జైలు సన్నివేశాలు చిత్రకరించాలి. అందుకనే సెప్టెంబర్‌లో ప్లాన్ చేస్తున్న షెడ్యూల్‌లో పూర్తి చేయాలని భావిస్తున్నాం. షూటింగ్‌కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తు చర్యల కోసం మేము ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నాం’’అన్నారు. ఇంకా చిత్రంలో  ప్రకాష్‌రాజ్‌, జాకీ ష్రాఫ్‌, కోట శ్రీనివాసరావు, నయనతార‌ నటిస్తున్నారు. చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో చిత్రీకరించి హిందీ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. రవి బస్రూర్ సంగీత స్వరాలు సమకూరుస్తుండగా, అర్జున్ శెట్టి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉపేంద్ర యువనటుడు వరుణ్‌తేజ్ త్వరలోనే నటించబోయో చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.