‘వకీల్‌సాబ్‌’ చిత్రం ఫోటో బయటకు ఎలా వచ్చింది?

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్‌సాబ్‌'. ఇప్పటికే సినిమా దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కరోనా వైరస్‌ లేకుంటే ఈ పాటికే తెరపైకి రావాల్సి ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కోర్టు సీను ఫోటో సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ హల్‌చల్‌ చేస్తుంది. లీకైన ఆ ఫోటోలో పవన్‌ కోర్టులో నిల్చుని ఉండగా ఆ పక్కన్నే నటి అంజలి కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రంలోని పవన్‌ పోస్టర్ తప్ప ఇంకా ఎటువంటి పోస్టర్లు కానీ విడుదల కాలేదు. ప్రస్తుతం మిగిలిపోయిన చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేయాలని భావిస్తోందట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తుండగా తమన సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్‌’ చిత్రానికి ‘వకీల్‌ సాబ్‌’ రీమేక్‌గా తెలుగులో నిర్మితమౌతోంది. ఇప్పటికే ఈ చిత్రం తమిళంలో అజిత్‌ హీరోగా బోనీ కపూర్‌ నిర్మాతగా ‘నెర్కొండ పార్వై’గా విడుదలై అలరించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.