వచ్చే యేడాది వేసవిలోనే వాలిమై!

తమిళ తలైవా అజిత్‌ కథానాయకుడిగా తన 60వ చిత్రం ‘వాలిమై’ చేస్తున్నాడు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అజిత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఆ మధ్య కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా గాయాలు కూడా అయ్యాయి. అయినా అజిత్‌ వెనక్కు తగ్గకుండా గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్నాడట. చిత్ర షూటింగ్‌ వచ్చే సంవత్సరం జనవరి మాసాంతంలో ముగియనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అసలు సినిమా ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనా మహమ్మారితో చిత్రీకరణ ఆలస్యమైంది. దాంతో ఈ చిత్రం వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. చిత్రంలో ప్రతినాయకుడిగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్‌ కార్తికేయ గుమ్మకొండ నటిస్తుండగా, బాలీవుడ్‌ భామ హుమా ఖురేషి కీలక పాత్రలో నటిస్తోంది. బోనీ కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి యవన్‌ శంకర్‌ రాజా సంగీతం స్వరాలు సమకూరుస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.