ప్రభాస్‌తో హిట్‌ కొడతా: వంశీ పైడిపల్లి

పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వచ్చిన సినిమా ‘మున్నా’. అప్పట్లో ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు మహేష్‌బాబు హీరోగా వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మహర్షి’. ఈ సినిమా విజయాన్ని అందుకొంది. ఈ సందర్భంగా ఇటీవల ఓ ముఖాముఖీలో ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ‘‘ఎప్పటికైనా ప్రభాస్‌తో విజయవంతమైన సినిమాను రూపొందిస్తాను. ప్రభాస్‌ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి...‘మున్నా’ విజయవంతం కాకపోయినా ఇంతవరకు నన్ను ఎప్పుడూ ఎక్కడా విమర్శించలేదు.. వ్యక్తిగతంగా దూరంగా పెట్టలేదు’’ అన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.