అలనాటి నటి వాణిశ్రీ కుమారుడు మృతి


ప్రముఖ తెలుగు సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తనయుడు అభినయ్ వెంకటేష్‌ కార్తిక్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.  బెంగళూరు అన్నపూర్ణ మెడికల్‌ కాలేజీలో అభినయ్‌ సహాయ ఆచార్యడిగా పనిచేస్తున్నారు. ఇటీవల తిరుక్కలికుండ్రంలో ఓ భవనాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే కొద్దిరోజులగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అదే బంగ్లాలో ఆయన ఆత్మచేసుకోవడం కలకలం సృష్టించింది. మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసులు వారి ప్రాధమిక విచారణలో వెల్లడించారు.  అభినయ్ సతీమణి కూడా వైద్యురాలేనని సన్నిహితులు తెలిపారు. సావిత్రి మనవరాలి ఆసుపత్రిలో ఆమె పని చేస్తోందన్నారు.  ఆయన మరణంతో చిత్రసీమ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. అంతేకాదు నటి వాణిశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపింది. వాణిశ్రీకి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తెలుగు చిత్రసీమలో కథానాయికగా ఓ వెలుగువెలిగిన వాణిశ్రీ.. దక్షిణాదిలోని తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో కూడా నటించి ప్రతిభను చాటుకుంది. వివాహం తరువాత వాణిశ్రీ సినిమాలకు కొంతకాలం స్వస్తి చెప్పారు. వాణిశ్రీ పెళ్లైయిన తరువాత అత్త, అమ్మలాంటి పాత్రలు వేస్తూ మళ్లీ వెండి తెర మీద కనిపించారు. చిరంజీవితో చేసిన ‘ ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా మనకు ఇప్పటికీ గుర్తొస్తొంది. ఈటీవీ’, సరికొత్తగా ప్రారంభించిన ‘ప్రేమనగర్‌’ ధారావాహికలో ఓ ప్రధాన పాత్ర పోషించింది వాణిశ్రీ.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.