బాక్సర్‌గా మారుతున్న ‘గద్దలకొండ’

కథల ఎంపికలో వైవిధ్యత కనబరిచే మెగా హీరోల్లో అందరి కన్నా ఓ అడుగు ముందుంటాడు వరుణ్‌ తేజ్‌. తొలి చిత్రం ‘ముకుంద’ నుంచి ఇటీవల వచ్చిన ‘గద్దలకొండ గణేష్‌’ వరకు ప్రతిదీ ఓ సరికొత్త జోనర్‌కు సంబంధించిన కథాంశంతో తెరకెక్కినదే. ఈ విజయోత్సాహంలో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించాడు ఈ యువ హీరో. వరుణ్‌ తేజ్‌ 10వ సినిమాగా రూపొందుతుంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ డ్రామాగా రూపొందబోయే ఈ చిత్రంలో వరుణ్‌ ఓ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. అల్లు వెంకటేష్, సిద్ధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి సురేఖ, నటుడు నాగబాబు హాజరయ్యారు. డిసెంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలువుతుంది. సంగీతం తమన్‌. టైటిల్‌, కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియనున్నాయి. కథ రీ త్యా ఈ చిత్ర షూటింగ్‌ ఎక్కువగా దిల్లీ, వైజాగ్, హైదరాబాద్‌ ప్రాంతాల్లో జరగనుందని సమాచారం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.