వెంకీతో శ్రియ?

వెంకటేష్, శ్రియ పలు చిత్రాల్లో నటించి హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ‘తులసి’ చిత్రంలో వెంకీ సరసన ఓ ప్రత్యేక గీతంలోనూ నర్తించి అలరించింది శ్రియ. మరోసారి ఈ ఇద్దరూ వెండితెరపై కనిపించబోతున్నారని ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో వినిపిస్తోంది. తమిళ్‌లో ధనుష్‌ హీరోగా వచ్చిన ‘అసురన్‌’ తెలుగులో వెంకీ రీమేక్‌ చేస్తున్నాడని తెలిసిన విషయమే కదా! ఈ చిత్రంలోనే శ్రియ వెంకీతో ఆడిపాడనుందని సమాచారం. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని టాక్‌. అయితే ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించేదెవరో ఇంకా స్పష్టత లేదు. అప్పుడే కథానాయిక శ్రియ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సురేష్‌ పొడ్రక్షన్స్‌ పతాకంపై సురేష్‌ బాబు, కలైపులి యస్‌.థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.