‘వెంకిమామ’ దసరాకు వస్తాడా?

అక్కినేని నాగచైతన్య, వెంకటేష్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకిమామ’. బాబీ (కె.ఎస్‌.రవింద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సినిమా షూటింగ్‌ ఒక్క పాట మినహా పూర్తైయిందని సమాచారం. సినిమాను మొదట దసరా పండుగ నాటికి విడుదల చేయలనుకున్నారట. కానీ అప్పుడు విడుదల అయ్యే సినిమాల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విడుదలను వాయిదా వేసుకుంటున్నట్లు సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. అయితే డిసెంబర్‌ మొదటి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా కథానాయికలుగా రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లు నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో ప్రకాష్‌రాజ్, సంపత్‌రాజ్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.