‘వెంకీమామ’లో అతిథి పాత్ర?

మొదటిసారిగా వెంకి, చైతూ కలసి నటిస్తున్న మల్టిస్టారర్‌ చిత్రం ‘వెంకిమామ’. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే చాలా మటుకు అంచనాలు పెరిగిపోయాయ్‌. తాజాగా విడుదలైన ప్రచారచిత్రం ఆ అంచనాలను మరింతగా పెంచ్చేసింది. హాస్యం, యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మామఅల్లుళ్ళు. విడుదల తేదీ దగ్గర అయ్యే కొద్ది సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతుంది చిత్ర బృందం. ఈ సినిమా అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు చాలా ప్రత్యేకం. అందుకు తగ్గట్టే ఇందులో ఒక అతిథి పాత్రను కూడా పెట్టారట. ఈ అతిథి పాత్రలో సమంత కనిపించనుందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అతిథి పాత్ర ‘మనం’ సినిమాలోని అఖిల్‌ పాత్రలాగా కథకు అనుగుణంగా ఉంటుందని సమాచారం. ఈ శుక్రవారమే ‘వెంకిమామ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్నాడు. రాశీఖన్నా, పాయల్‌ రాజపుత్‌ ఇందులో కథానాయికలుగా నటించారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.