పెళ్లిచేసుకొన్న అమలాపాల్‌ మాజీ భర్త!

ప్రముఖ నటి అమలాపాల్‌ మాజీ భర్త అయిన దర్శకుడు విజయ్‌ మళ్లీ పెళ్లి చేసుకొన్నారు. కొద్ది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగిందని సమాచారం. విజయ్‌ చేసుకున్న అమ్మాయి డాక్టర్‌గా పనిచేస్తుందట. పేరు ఐశ్వర్య. గతంలో విజయ్‌ నటి అమలాపాల్‌ను 2014న వివాహం చేసుకొని కొన్నాళ్ల పాటు సుఖంగా వారి సంసారం 2016లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి 2017లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం విజయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దిగంగత నేత జయలలిత జీవితాధారంగా ఓ చిత్రం చేస్తున్నారు. జయలలితగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.