‘బిచ్చగాడు’ సీక్వెల్‌ కోసం రచయితగా మారిన విజయ్

ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ ఆంటోని తెలుగులో ‘బిచ్చగాడు’ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించాడు. 2016లో తమిళ, తెలుగులో ఒకే నెలలో విడుదలై ఘనమైన వసూళ్లు సాధించింది. ఇదే సినిమాకి సీక్వెల్‌ తీయనున్నారు. అందుకోసం నటుడు విజయ్‌ రచయితగా మారాడు. తాజాగా విజయ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘నాలుగు నెలల నుంచి సీక్వెల్‌ కోసం స్ర్కిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నాను. స్ర్కిప్టుకి తుదిమెరుగులు పెడతున్నాం. త్వరలోనే తారాగణంతో పాటు సాంకేతివర్గాన్ని వెల్లడిస్తానని’’ చెప్పాడు. మొదట్లో వచ్చిన ‘పిచైకరన్‌’ (బిచ్చగాడు) చిత్రానికి దర్శకత్వం వహించిన శశి ప్రస్తుతం వేరే చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రాబోయో సీక్వెల్‌ చిత్రానికి సంగీతం కూడా విజయ్‌ ఆంటోనినే చేపట్టనున్నాడట. విజయ్‌ ఆంటోని ప్రస్తుతం ‘తమీజరాసన్‌’, ‘అగ్ని సిరగుగాల్‌’, ‘ఖాకీ’ చిత్రాలతో పాటు మరో మూడు సినిమాల్లోను నటించనున్నాడు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.