రంగం సిద్ధమవుతోందా?

ఊహించని మరో కాంబినేషన్‌కి రంగం సిద్ధమవుతుందని టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను- విజయ్‌ దేవరకొండ కలయికలో ఓ చిత్రం వచ్చే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. లాక్‌డౌన్ విరామ సమయంలో దర్శకులందరూ రెండు మూడు కథలు సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో బోయపాటి కూడా ఉన్నారట. ప్రస్తుతం ఆయన బాలకృష్ణ కథానాయకుడుగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తయ్యాక విజయ్‌తో చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట బోయపాటి. గత చిత్రాల్లానే తనదైన శైలిలో యాక్షన్‌ స్క్రిప్టుని రాసుకున్నారని వినికిడి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నారని, త్వరలోనే స్పష్టత రావచ్చని సమాచారం. మరి ఈ క్రేజీ కాంబో సినిమా ఉంటుందా, లేదా? కొంతకాలం ఆగాల్సిందే. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్‌. సుకుమార్‌తో ఓ చిత్రం ప్రకటించాడు. మరోవైపు శివ నిర్వాణ, మోహన కృష్ణ ఇంద్రగంటి కథలకు ఓకే చెప్పాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.