విజయ్‌ కొత్త చిత్రం ‘బ్రేక్‌అప్‌’?

యువ తెలుగు నటుడు విజయ్‌ దేవరకొండ, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికలుగా ఐశ్వర్యరాజేష్, రాశీఖన్నా, ఇజ్‌బెల్లా నటిస్తున్నారు. చిత్రంలో విజయ్‌ విఫల ప్రేమికుడి పాత్రలో నటిస్తున్నారని సమాచారం. సింగరేణి కాలరీస్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న కథలో ముగ్గురమ్మాయిల ప్రేమికుడిగా విజయ్‌ నటిస్తున్నారు. ఇందులో ఏ అమ్మాయికి బ్రేక్‌అప్‌ చెప్పాడనేది సస్పెన్స్‌. కథలో భాగంగా చిత్రానికి ‘బ్రేక్‌అప్‌’ అనే టైటిల్‌ అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు అనుకుంటున్నాయట. అయితే అధికారింగా ఈ పేరును ప్రకటించాల్సి ఉంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.