మహేష్‌ చిత్రంలో విజయశాంతి పాత్ర ఇదేనట

‘లేడీ అమితాబ్‌’ విజయశాంతి మళ్లీ వెండితెరపై మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతోంది. మహేష్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంఓ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌కు వెళ్లబోతుంది. ఈ నేపథ్యంలో రీఎంట్రీలో విజయశాంతి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది, పాత్ర నిడివి ఎంత? వంటి అంశాలపై ఇప్పటికే ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. ఆమె మహేష్‌కు అత్తగా కనిపించబోతుందని కొందరు.. కాదు, ‘నరసింహా’లోని రమ్యకృష్ణలా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనుందని మరికొందరు ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన పాత్ర గురించి పూర్తిగా క్లారిటీ ఇచ్చేసింది విజయశాంతి.‘ ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్‌ పాత్రకు నా పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదు. రెండు పాత్రలు దేనికదే ప్రత్యేకం. కథతో సమాంతరంగా ఒకదానితో మరొకటి పోటీపడుతూ సాగుతుంటాయి. ప్రతినాయక ఛాయలున్న పాత్ర అసలే కాదు. పాజిటీవిటీ ఉన్న క్యారెక్టర్‌లోనే కనిపిస్తా. అది అందరికీ నచ్చేలాగ ఉంటుంది’’ అని ఊహాగానాలకు చెక్‌ పెట్టింది విజయశాంతి.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.