రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్న విజ‌య‌శాంతి?

మ‌హేష్‌బాబు - అనిల్ రావిపూడికాంబోలో సినిమా పట్టాలెక్క‌బోతోంది. ఓ కీల‌మైన పాత్ర కోసం విజ‌య‌శాంతి పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. అనిల్ ఇటీవ‌లే విజ‌య‌శాంతిని క‌లిసి క‌థ, పాత్ర కూడా వివ‌రించి వ‌చ్చాడ‌ట‌. ఈ పాత్ర విజ‌య‌శాంతికి బాగా న‌చ్చింది. కాక‌పోతే.. పారితోషికం ద‌గ్గ‌రే పేచీ వ‌స్తోంది. ఈ సినిమాలో న‌టించాలంటే రూ.5 కోట్లు ఇవ్వాల‌ని విజ‌య‌శాంతి డిమాండ్ చేస్తోంద‌ట‌. కానీ... నిర్మాత అనిల్ సుంక‌ర మాత్రం రూ.2 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా పారితోషికాలు చుక్క‌ల్ని తాకుతున్నాయి. మ‌హేష్ కి రూ 50 కోట్లు, అనిల్ రావిపూడికి 10 కోట్లు పారితోషికం ఇస్తున్నారు. క‌థానాయిక ర‌ష్మిక‌కు మ‌రో కోటి ఇవ్వాలి. దేవిశ్రీ‌లాంటి సంగీత ద‌ర్శ‌కుడ్ని తీసుకుంటే రూ.2 కోట్లు ఇవ్వాలి. విజ‌య‌శాంతికి రూ. 5 కోట్లు ఇచ్చే స్థితిలో నిర్మాత లేడు. కాక‌పోతే విజ‌య‌శాంతిని తీసుకురాగ‌లిగితే... ఈ సినిమాకి మ‌రింత బ‌లం వ‌స్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. విజ‌య‌శాంతి కాక‌పోతే ర‌మ్య‌కృష్ణ రూపంలో మ‌రో ఆప్ష‌న్ ఉంది. కానీ బాహుబ‌లి త‌ర‌వాత చాలా సినిమాల్లో ర‌మ్య న‌టించింది. త‌నుకే కాదు, ప్రేక్ష‌కుల‌కు కూడా ర‌మ్య‌కృష్ణ రొటీన్ అయిపోతుంది. అందుకే వెరైటీ కోసం విజ‌య‌శాంతిని ట్రై చేస్తున్నారు. విజ‌యశాంతినే కావాలి అనుకుంటే 5 కోట్లు స‌మ‌ర్పించుకోవాలి. లేదంటే... విజ‌య‌శాంతి అయినా కింద‌కు దిగి రావాలి. ఈ రెండింటిలో ఏది జ‌రుగుతుందో చూడాలి.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.