ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనున్న కాతివాకుల రెండు కాదల్

రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంగా రూపొందనున్న తమిళ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్‌’. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, సమంత, నయనతారలు కథానాయికలుగా నటిస్తున్నారు. సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియోస్‌ సమర్పణలో నిర్మితమౌతున్న ఈ సినిమా ఆగస్టులోనే సెట్స్ పైకి వెళ్లనుందని నిర్మాణసంస్థ తెలిపింది.  ఇందులో పార్తిబన్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అసలు ఏప్రిల్లోనే చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ ప్రభుత్వాలు ఇప్పుడు కొన్ని షరతులతో కూడిన అనుమతులు కూడా ఇస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్ సంగీత సమకూరుస్తుండగా హీరో ధనుష్‌కి చెందిన వండర్‌బార్ స్టూడియో నిర్మాత వ్యవహరిస్తుంది. సమంత - విజయ్‌ సేతుపతి తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు తొలుత ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా వ్యవహారాలన్నీ పూర్తిగా మారిపోయాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.