కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో విలన్‌గా విక్రమ్‌?

‘అపరిచితుడు’ నటుడు విక్రమ్‌ వైవిధ్యమైన పాత్రలు చేయడంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. ఆయన సినిమాల్లోని పాత్రల కోసం తన ఆహార్యాన్ని మార్చేస్తుంటాడు. అలాంటి విక్రమ్‌ ప్రస్తుతం కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఇంకా పేరుపెట్టని తన 60వ చిత్రంలో నటించనున్నాడు. ఇందులో తన కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో కలిసి పోరాటాలు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అంటే ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడని చెప్పుకుంటున్నారు. 7 స్ర్కీన్‌ స్టూడియో సమర్పణలో లలిత్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న ఈచిత్రానికి అనిరుధ్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. విక్రమ్‌ ఇప్పటి వరకు వేరొకరి సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించలేదు. ఒకవేళ అలా నటిస్తే..వేరొక హీరో చిత్రంలో తొలిసారిగా ప్రతినాయకుడిగా నటించడం ఇదే ప్రధమం అవుతోంది. లాక్‌డౌన్‌ పూర్తికాగానే చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అన్నట్లు విక్రమ్‌ 2016లో వచ్చిన ‘ఇరు ముగాన్‌’ (తెలుగులో ‘ఇంకొక్కడు’) చిత్రంతో తనే ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో రా ఏజెంట్‌ అఖిలన్‌గా, మరొకటి క్రిమినల్ సైంటిస్ట్ గా నటించి అలరించాడు. 

Happy to announce that my next directorial after #JagameThandhiram is.... 'CHIYAAN60'#Chiyaan60Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.