విజయ్‌, విక్రమ్‌ చిత్రాల అప్‌డేట్స్‌

తమిళ నటులు విజయ్‌, విజయ్‌ సేతుపతి, విక్రమ్‌ క్రేజీ ప్రాజెక్టులతో అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. పలు విభిన్న పాత్రల్లో కనిపించేందుకు ‘కోబ్రా’గా మారాడు విక్రమ్‌. విజయ్‌, విజయ్‌ సేతుపతి పోటీపోటీగా తలపడేందుకు ‘మాస్టర్‌’ ప్లాన్‌ వేసుకుంటున్నారు. మరోవైపు ‘తుగ్లక్‌ దర్బార్‌’, ‘కాతువాకులరెండు కాద’ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు విజయ్‌ సేతుపతి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఎంతశాతం షూటింగ్‌ పూర్తయిందో తెలియజేస్తూ ఓ ట్వీట్‌ చేసింది సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియో నిర్మాణ సంస్థ. ఈ ముగ్గురు కథానాయకుల సినిమాల చిత్రీకరణకు సంబంధించి వివరాలు అభిమానులతో పంచుకుంది. ఆ వివరాలివీ... ‘మాస్టర్‌’ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమం జరుపుకుంటుంది. విక్రమ్‌ ‘కోబ్రా’ 90 రోజుల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇంకా 25 శాతం చిత్రీకరణ మిగిలి ఉంది. విజయ్‌ సేతుపతి నటిస్తున్న ‘తుగ్లక్‌ దర్బార్‌’ 35 రోజుల చిత్రీకరణ జరుపుకుంది. 40 రోజుల షెడ్యూల్‌ ఉంది. మరో సినిమా ‘కాతువాకులరెండుకాద’ ఆగస్టులో ప్రారంభంకానుంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.