చాలా కాలం తరువాత??

‘ప్రేమదేశం’, ‘అమ్మాయి కోసం’, ‘నీ ప్రేమకై’, ‘వైఫ్‌ ఆఫ్‌ వి. వరప్రసాద్‌’, ‘చంద్రముఖి’ తదితర చిత్రాలతో అలరించిన మలయాళ నటుడు వినీత్‌ ఇన్నేళ్లకు మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడని సమాచారం. నితిన్‌ కథానాయకుడుగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రంగ్‌ దే’. కీర్తి సురేష్‌ నాయిక. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వినీత్‌ని సంప్రదించిందట చిత్రబృందం. పాత్ర స్వభావం ఆసక్తిగా ఉండటంతో నటించేందుకు వినీత్‌ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. టాలీవుడ్‌లో హిట్‌ టాక్‌ తెచ్చుకున్న చాలా చిత్రాల్లో ముఖ్య పాత్ర పోషించాడు వినీత్‌. మరి ఈ సారి ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కూర్పు: నవీన్‌ నూలి, సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్‌. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.