విశాల్‌తో శ్రద్దా శ్రీనాథ్‌ రొమాన్స్‌!

‘జెర్సీ’భామ శ్రద్దా శ్రీనాథ్‌ నటుడు విశాల్‌తో కలిసి ఓ సినిమా చేయనుంది. గతంలో వచ్చిన ‘అభిమన్యుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తుంది. పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అభిమన్యుడు’ మంచి పేరే సంపాదించింది. ఇప్పుడు ‘అభిమన్యుడు2’గా వస్తున్న ఈ సినిమాకి ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదటగా వచ్చిన ‘అభిమన్యుడు’లో కథానాయిక సమంత. ఇప్పుడు శ్రద్దా శ్రీనాథ్‌. అలాగే దర్శకడు మిత్రన్‌కు బదులు ఆనంద్‌. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.