బాలీవుడ్‌ సంగీత దర్శకుడు వాజీద్‌ ఖాన్‌ కన్నుమూత


ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు వాజీద్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంబైలోని ఓ ప్రవేట్‌ ఆసుపతిలో నిన్న (మే 31) వాజీద్‌ ఖాన్‌ (42) మరణించారు. ఆయన ఈ మధ్యనే లాక్‌డౌన్‌ కాలంలో సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘భాయి భాయి’ అనే గీతానికి సంగీతం సమకూర్చాడు. నెలరోజుల కిత్రమే వాజీద్‌కి కిడ్నీ మార్పిడి జరిగింది. సాజిద్‌ -వాజీద్‌ ఖాన్‌ల సంగీత ద్వయం హిందీలో ఎన్నో చిత్రాలకు సంగీత స్వరాలు సమకూర్చారు. వీళ్ల సంగీత ప్రయాణం సల్మాన్‌ఖాన్‌ నటించిన ప్యార్ కియా తో దర్నా క్యా’ చిత్రంతో మొదలైంది. హేమేష్‌ రేష్మియాతో కలిసి సల్మాన్‌ ఖాన్‌, ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్‌ నటించిన ‘హలో బ్రదర్‌’ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సంగీత ద్వయం సల్మాన్ ఖాన్ నటించిన అనేక చిత్రాలకు సంగీతం అందించింది. వాటిలో ఇందులో ‘తుమ్కో నా భూల్ పాయెంగే’ (2002), ‘తేరే నామ్’ (2003), ‘గార్వ్’ (2004), ‘ముజ్సే షాదీ కరోగి’ (2004), ‘పార్టనర్‌’ (2007), ‘హలో’ (2008 ), ‘గాడ్ టుస్సీ గ్రేట్ హో’ (2008), ‘వాంటెడ్’ (2009), ‘మెయిన్ మిస్టర్స్ మిసెస్ ఖన్నా’, (2009), ‘వీర్’ (2010), ‘దబాంగ్’ (2010) , ‘నో ప్రాబ్లమ్’ (2010) ‘ఏక్ థా టైగర్‌’ చిత్రంలోని ‘మషాల్హాహ్‌’ పాటకు  పనిచేశారు. ఇంకా అనేక ఇతర హీరోల చిత్రాలైన ‘క్యా యేహి ప్యార్ హై (2002), ‘గునాహ్’ (2002), ‘చోరి చోరి’ (2003), ‘ది కిల్లర్’ (2006), ‘షాదీ కార్కే ఫాస్ గయా యార్’ (2006), ‘జానే హోగా క్యా’, ‘కల్ కిస్నే దేఖా’లాంటి చిత్రాలకు సంగీతం అందిచారు.  వాజీద్‌ ఖాన్‌ మృతికి సంతాపంగా ఎందరో సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని సామాజిక మాధ్యమాల తెలిపారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.