మనాలికి బయలుదేరిన నాగార్జున ‘వైల్డ్ డాగ్’‌

అక్కినేని నాగార్జున ఎన్ఐఏ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’‌. నూతన దర్శకుడు అహిషర్ సోలమన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కోసం‌ హిమాలయాలకు వెళ్లింది. అక్కడే కొన్నాళ్లు షూటింగ్‌ జరుపుకోనుందని సమాచారం. లాక్‌డౌన్‌ తరువాత హైదరబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ మొదలైన సంగతి తెలిసిందే. చిత్రంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. చిత్రంలో నాగార్జున ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ విజయ్‌ వర్మగా దర్శనమివ్వబోతున్నారు. ఆ మధ్య నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఓ ఫోస్టర్ని విడుదల చేసింది. అందులో వైల్డ్ డాగ్' బృందంలో సభ్యులైన అలీ రెజా (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), ఆర్యా పండిట్ (స్పెషల్ ఏజెంట్ - రా), కాలెబ్ మాథ్యూస్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), రుద్రా గౌడ్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), హష్వంత్ మనోహర్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ) కూడా ఈ పోస్టర్ పరిచయం చేసింది. నేరస్తులతో ఏసీపీ విజయ్ వర్మ నేరస్తులతో వ్యవహరించే అత్యంత కఠినమైన తీరుతో ఆయన్ని 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రాన్ని నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలై అంచనాలు పెంచింది. ప్రస్తుతం ఉన్న సినీయర్‌ కథానాయకుల్లో నాగార్జున తొలుత సెట్స్ పైకి వచ్చారు. ముందుగా బిగ్‌బాస్‌ షోతో పాటు, ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.