బాలీవుడ్‌ గీత రచయిత యోగేష్‌ గౌర్‌ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్‌ గీత రచయిత యోగేష్‌ గౌర్‌ కన్నుమూశారు. ఎన్నో గొప్ప సినిమాల్లో మధురమైన పాటలను అందించిన యోగేష్‌ (77) ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన ‘కహి దుర్‌ జబ్‌ దున్‌’, ‘రజనీగంధ ఫూల్‌ తుమ్హారే’ వంటి ఎన్నో గొప్ప గీతాలను బాలీవుడ్‌ ప్రేక్షకులకు అందించారు. ఈయన మార్చి 19, 1943న ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. ఆయన  దర్శకుడు హృషికేష్‌ ముఖర్జీతో కలిసి ‘ఆనంద్’‌ (1971) సినిమా కోసం ‘కహిన్‌ డోర్‌ జబ్‌ దాల్‌ జాయే’ అనే పాట రాశారు. అంతేకాదు ‘జిందగి కైసీ హై పహేలి, రింజిమ్‌ గైర్‌ సావన్‌, ‘రజనీగంధ’ చిత్రం కోసం ‘కై బార్‌ యున్హి దేఖా హై’, ‘బాటన్‌ బాటన్‌ మెయిన్‌’ చిత్రం కోసం ‘‘నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా’’ రాశారు. ఇంకా ‘ఏక్‌ రాత్‌’, ‘సఖి రాబిన్’‌ (1962) ‘మిలీ’, ‘చోటి సి బాత్’‌ ,‘ఆనంద్’‌ (1971) ‘ఆజా మేరీ జాన్’, ‘మన్జీల్‌’, ‘ఔర్ భీ హైన్’, లాంటి చిత్రాలకు గీత రచయితగా పనిచేశారు. యోగేష్‌ ఎన్నో బుల్లితెర సీరియల్స్ కు రచయితగా వ్యవహరించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.