Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
కొత్త కబుర్లు
ట్రైలర్...టీజర్
Search
ట్రైలర్...టీజర్
కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు..
తెలుగు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ లాయర్‌గా నటిస్తోన్న చిత్రం వకీల్‌సాబ్. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిక నటిస్తోంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో సినిమాలకు దూరమైన పవన్ తిరిగి నటిస్తున్న చిత్రం ఇదే. విడుదలైన టీజర్లో కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్‌కల్యాణ్ చెప్పే డైలాగ్ ఆకట్టకునేలా ఉంది. బాలీవుడ్లో విజయవంతమైన పింక్’ చిత్రానికి ‘వకీల్‌సాబ్’ రీమేక్. హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ కాసుల వర్షం కురిపిందిచింది. బోనీ కపూర్ సమర్పణలో వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్‌రాజు - శిరీష్ నిర్మాతలు. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆకట్టుకుంటోన్న డబ్యు.డబ్యు.డబ్లు టీజర్
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు’. ఎవరు, ఎక్కడ, ఎందుకు...అనేది ఉపశీర్షిక. కె.వి.గుహన్ దర్శకుడు. తాజాగా చిత్రానికి సంబంధించిన టీజర్‌ని తెలుగు నటుడు మహేషబాబు ఆవిష్కరించారు. ఈ ఆధునిక యుగంలో ప్రతిది ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. అలా ఈ చిత్రంలో అందరూ ఆన్లైన్ చాటింగ్ చేస్తూ ఉంటారు. ఉన్నట్లుండి కంప్యూటర్ అంతా డార్క్ అయిపోతుంది. ఎవరో హ్యాక్ చేసినట్లు ఉంటుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హీరో రానా విడుదల చేశారు. ఇదొక హై కాన్సెప్ట్ కథగా ఉందని రానా అన్నారు. చిత్రాన్నితెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కిస్తున్నారు. రమంత్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమౌతున్న చిత్రానికి డా.రవి పి.రాజు దాట్ల నిర్మాత. సహనిర్మాత విజయ్ ధరన్ దాట్ల. సైమన్ కె కింగ్ సంగీత స్వరాలు అందిస్తుండగా, ఎడిటర్‌గా తమ్మి రాజు వ్యవహరిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ సాహిత్యం అందిస్తున్నారు. త్వరలోనే చిత్రం విడుదల కానుంది.
ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం
వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. బోగి- సంక్రాంతి పండగను పురస్కరించుకొని టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
ఇంతకీ ఆ కపటధారి ఎవరు?
సుమంత్ కథానాయకుడిగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కపటధారి’. నందితా శ్వేత కథానాయిక. నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రాఫిక్ ఎస్సై అయిన ఓ వ్యక్తి ఓ హత్య కేసును ఎలా ఛేదించాడన్న ఆసక్తికర కథాంశంతో ‘కపటధారి’ తెరకెక్కింది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ట్రాఫిక్ ఎస్సై అయిన సుమంత్ క్రైమ్ కేసును ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది? చివరకు దాన్ని పరిష్కరించాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ గ్లింప్స్
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బస్తీ బాలరాజుగా కనిపించనున్నాడు కార్తికేయ. ఆసుపత్రిలో పనిచేసే సిస్టర్ పాత్ర పోషిస్తుంది లావణ్య. తాజాగా టీజర్ గ్లింప్స్ విడుదలైంది. ‘నువ్వు ఆసుపత్రిలో సిస్టర్ అంటగా మంచి ఉద్యోగమే వెతుకున్నావ్. మనం ప్రేమించిన అమ్మాయి మనకు తప్ప అందరికి సిస్టర్ అనే ఫీలింగ్ ఏదైతో ఉందో.
హత్తుకుంటున్న ‘లవ్‌స్టోరీ’ టీజర్
ప్రేమ కథల్ని వైవిధ్యంగా తెరకెక్కించే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన నుంచి త్వరలోనే రాబోతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి నాయకానాయికలు. తాజాగా చిత్ర టీజర్‌ని విడుదల చేశారు.టీజర్ చూస్తుంటే మరో అందమైన ప్రేమకథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాదీ స్టైల్లో ‘జీరోకెల్లి వచ్చినా సార్.. చానా కష్టపడతా..మంచి ప్లాను ఉంది’ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. రేవంత్ పాత్రలో చై, మౌనిక పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయినట్టు అనిపిస్తోంది. పవన్ సీహెచ్ అందించిన నేపథ్యసంగీతం ఆకట్టుకుంటోంది. చివర్లో నాగచైతన్యతో.. ‘ఏందిరా..వదిలేస్తావా నన్ను’ అంటూ సాయిపల్లవి అన్న మాటలు ప్రేక్షకుల్ని హత్తుకుంటున్నాయి. అమిగోస్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
యాక్షన్ చిత్రాల్లో నటించడం నాకిష్టం: సన్నీ లియోనీ
శృంగార తార సన్నీ లియోనీ, కరీష్మా తన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సీరీస్ చిత్రం బుల్లెట్స్. దేవాంగ్ ధోలాకియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి సన్నీ లియోనీ మాట్లాడుతూ..ఈ సినిమాలో కథానాయకురాలిగా ప్రధాన కథను నడిపించే పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త పాత్ర నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇందులో నా పాత్ర పేరు టీనా. ఆమె అసమాన ధైర్యం, కఠినంగా ఉండంటం నాకెంతో నచ్చింది. ఇలాంటి సాహసోపేతమైన పాత్రను పోషిస్తున్నందుకు గర్వంగాను ఉంది. చిత్ర కథేంటంటే టీనా (సన్నీ లియోనీ) లోలో బోల్డ్ (కరిష్మా తన్నా) ధైర్యవంతురాళ్లు. వారు చేసే పనేంటంటే రెండు దేశాల మధ్య అక్రమ ఆయుధాలు ఒప్పందాన్ని అడ్డుకోనే పనిలో ఉంటారు. ఓ కేసులో అక్రమ ఆయుధాలకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించే తపనలో ప్రమాదంలో పడతారు. అయితే అది ఓ ప్రభావవంతమైన రాజకీయనాయకుడిగా వ్యతిరేకంగా పోరాడతారు. అయితే వీరిని అటు పోలీసులు, ఇటు గుండాలు వెంబడిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తమను తాము రక్షించుకొనేందుకు పారిపోతారు. తరువాత అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ అమ్మాయిలు అరెస్టు అవుతారా?
విక్రమ్ ‘కోబ్రా’ టీజర్ చూశారా!!
చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రం కోబ్రా. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన టీజర్ ఒకటి విడుదలైంది. ట్రైలర్లో విక్రమ్ లెక్కల టీజర్‌గా కనిపిస్తారు. ఆ తరువాత వైవిధ్యమైన గౌటప్లతోనూ అలరించారు. ప్రతి సమస్యకు నంబర్లతోనే పరిష్కారం దొరుకుతుందనే విధంగా చేస్తాడు. ఇందులో వివిధ రకాల వేషాలతో తన ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతుంటాడు. చివర్లో విక్రమ్‌ని పట్టుకొని తలకిందులుగా వేలాడదీసి కొడుతుంటారు. లెక్కల టీచర్ నువ్వేనా అంటూ రౌడీల అడిగిన ప్రశ్నకు నవ్వుతూ ఉంటాడు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ హరీష్ కన్నన్ కెమెరా వైవిధ్యతో పాటు రెహమాన్ మ్యూజిక్ టీజర్‌కి కొత్త ఊపును తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఇందులో కె.ఎస్. రవికుమార్, రోషన్ మాథ్యూ, ఆనందరాజ్, రోబో శంకర్, మియా జార్జ్, మిర్నాలిని రవి, మీనాక్షి గోవిందరాజన్ తదితరులు నటిస్తున్నారు. సెవెన్ స్ర్కీన్ పతాకంపై నిర్మితమౌతున్న చిత్రానికి ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కోబ్రాకు సంబంధించిన ఫస్ట్ లుక్ వి
హీటెక్కిస్తున్న కేజీఎఫ్2 టీజర్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం కేజీఎఫ్2. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా టీజర్ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంది అన్నదాంట్లో సందేహం లేదు.
ఆకట్టుకుంటున్న అనుపమ లఘు చిత్ర టీజర్
లఘు చిత్రాల(షార్ట్ ఫిల్మ్స్) నుంచి వెండితెరకు వచ్చిన నటులు చాలా మంది ఉంటారు.కానీ బిగ్‌స్ర్కీన్‌పై మెరుస్తూ చిన్న తెరపై కనిపించే నటీనటులు అరుదు. ఆ కోవలోకి చేరిపోయింది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ. ఆమె నటించిన మలయాళ లఘు చిత్రం ‘ఫ్రీడం మిడ్నైట్’. హకీం షాజహాన్, అనుపమ జంటగా ఆర్జే షాన్ రూపొందించారు. ఇటీవలే టీజర్ విడుదలైంది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ ఆసక్తి పెంచుతుంది. భార్యాభర్తల మధ్య సాగే కథలా అనిపిస్తుంది. అనుపమ చీరకట్టులో సంప్రదాయంగా కనిపించడమే కాదు గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. నాయకానాయికల మధ్య రొమాన్స్‌ని చక్కగా చూపించారు.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
ప్రారంభమైన ప్రభాస్ సలార్ చిత్రం
‘పీఎస్పీకే 27’.. మళ్లీ మొదలైంది
నిహారిక కొణిదెల వెబ్ సిరీస్ చిత్రం ప్రారంభం
ధనుష్ 43వ చిత్రం ప్రారంభం
మరో ప్రేమకథ మొదలైంది..
హీరోగా జానీ మాస్టర్
కార్యక్రమాలు
మరిన్ని
అబ్బాయి మెరుపుతీగలా’ ఉన్నాడు
విభిన్నంగా... ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు’
సంక్రాంతికి విడుదలవుతున్న “సైకిల్ ”
వైభవంగా సునీత-రామ్‌ల వివాహం
షూటింగ్ పూర్తి చేసుకున్న బ్యాక్ డోర్
‘జగదీష్’ నాయుడు అప్డేట్ ఇచ్చాడు
అవి ఇవి
మరిన్ని
నా పేరు శివ దర్శకుడు సుశీంద్రన్ తల్లి కన్నుమూత
మెగా కుటుంబ సభ్యులతో నాగార్జున
సెట్స్ పైకి వెళ్లిన ‘గంగూబాయి కతియావాడి’
ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి ముహూర్తం ఖరారు!
ఇళయరాజా - అజయ్ ప్రతీబ్ల ‘పొన్నియన్ సెల్వన్’
అది నావల్ల కాదు..లారెన్స్
ట్రైలర్...టీజర్
మరిన్ని
కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు..
ఆకట్టుకుంటోన్న డబ్యు.డబ్యు.డబ్లు టీజర్
ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం
ఇంతకీ ఆ కపటధారి ఎవరు?
ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ గ్లింప్స్
హత్తుకుంటున్న ‘లవ్‌స్టోరీ’ టీజర్
ఆన్లైన్లో..
మరిన్ని
‘పొన్నియన్ సెల్వన్’ సెట్లో ప్రకాష్‌రాజ్
వేసవిలో విడుదల కానున్న 'విరాటపర్వం'
సంక్రాంతి శుభాకాంక్షలు...మన కొత్త చిత్రాలు
బెల్లీ డ్యాన్స్‌తో ఊపేస్తున్న జాన్వీ
జాక్విలిన్ - సుదీప్‌ల ఫాంటమ్ పాట
త్వరలోనే పెళ్లిసందడి థియేటర్లో కలుద్దాం: రాఘవేంద్రరావు
ప్రకటనలు
మరిన్ని
పవన్ - రానా చిత్రానికి మాటల రచయితగా త్రివిక్రమ్
‘సర్కారు వారి పాట’ గురించి ఏమన్నారంటే..
రాజకీయాల్లోకి రాను.. ఇబ్బంది పెట్టకండి!
విద్యుత్ - శ్రుతిల ‘పవర్’ వచ్చేది అప్పుడే!
ఉగాదికి వస్తోన్న ‘టక్ జగదీష్’
కొత్త కలయిక కుదిరింది