నవ్వులు పూయిస్తున్న ‘ఏబీసీడీ’ ట్రైలర్‌

ల్లు శిరీష్‌ - రుక్సార్‌ ధిల్లన్‌ జంటగా సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’.. ఉపశీర్షిక. జుదా శాండీ స్వరాలు సమకూర్చారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘‘హాయ్‌ నా పేరు అవి. నేను జీవితంలో మూడు ‘ఈ’లను ఫాలో అవుతుంటాను. ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎగ్జైట్‌మెంట్‌’’ అంటూ శిరీష్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. అమెరికాలో జన్మించి అక్కడి విలాసవంతమైన జీవితానికి అలావాటుపడిన వ్యక్తి, అనుకోని కారణాల వల్ల భారత్‌కు రావడం, ఇక్కడ అతని స్నేహితుడితో కలిసి మధ్యతరగతి జీవితం గడపాల్సి రావడం, ఈ క్రమంలో వారిద్దరూ ఎదుర్కొన్న కష్టాలేంటి? వంటి ఆసక్తికర అంశాలతో చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బాల నటుడిగా నవ్వులు పంచిన భరత్‌ ఇందులో శిరీష్‌ స్నేహితుడిగా సందడి చేస్తున్నాడు. నాగబాబు పెద్ద బిజినెస్‌మేన్‌గా అల్లు శిరీష్‌ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. ‘‘డాడ్‌.. నువ్వు స్వయం కృషి’లో చిరంజీవిలా ఫీలవ్వకు. కష్టాల్లోకి తోసేస్తే మారిపోతానని అనుకోకు. నేను రిచ్‌గానే పుట్టా, రిచ్‌గానే పెరిగాను, రిచ్‌గానే ఉంటాను’’ అంటూ ట్రైలర్‌ చివర్లో శిరీష్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.