తెలుగులో విశాల్‌ ‘యాక్షన్‌’ హంగామా చూశారా..
కండలు తిరిగిన ఆరడుగుల దేహం ఇంతకన్నా ఏం కావాలి వెండితెరపై యాక్షన్‌ చేయటానికి. భారీ బడ్జెట్‌తో విశాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్‌’. తాజాగా ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. ఇందులో ఒక అంతర్జాతీయ డాన్‌ కోసం కథానాయకుడు వెతుకుతుంటాడు. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ప్రచార చిత్రంలో కనపడుతున్నాయి. ఈ చిత్రంలో తమన్నా గ్లామర్‌తో పాటుగా గన్‌ పట్టి యాక్షన్‌ కూడా చేస్తుంది. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంది ఈ చిత్రం. విడుదల తేదిని తొందరలోనే ప్రకటించనున్నారు.


                               Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.