రొమాంటిక్‌గా కనిపిస్తున్న రూలర్‌

నందమూరి బాలకృష్ణ  కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘రూలర్‌’. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌  వీడియో  ఒకటి విడుదలై అలరిస్తుంది. ’’అడుగడుగో యాక్షన్‌ హీరో’’ అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని అలరించేలా ఉంది. ఈ నెల 14న సినిమా ముందస్తు విడుదల వేడుకను విశాఖపట్నం నగరంలో చేయనున్నట్లు చిత్రబృంందం ప్రకటించింది.  రొమాంటిక్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్స్, స్టిల్స్‌ విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇందులో నాయికలుగా సోనాల్‌ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక చావ్లా, ప్రకాష్‌ రాజ్, జయసుధలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 20, 2019న విడదుల కానుంది.


                                 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.