అదరగొడుతున్న ‘అల వైకుంఠపురములో’ టీజర్‌

ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులు ఎదురు చూస్తున్న ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ వచ్చేసింది. అల్లు అర్జున్‌ కథానాయకుడుగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. పూజాహెగ్డే కథానాయిక. నవదీప్, సుశాంత్, టబు, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో కనిపించన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచారు నిన్ను’ అని బన్నీని ఉద్దేశించే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. సరిగా చూడలేదు ముందుకు రా.. అనగానే స్టైలిష్‌గా నడుస్తూ వస్తాడు. మురళీ శర్మ ఓ భవనాన్ని చూపిస్తూ అది వైకుంఠపురంరా అని చెప్పినప్పుడు వచ్చే నేపథ్య సంగీతం అలరిస్తుంది. టబు డ్యాన్స్‌ చేస్తూ కనిపిస్తుంది. ‘మీరిప్పుడే కారు దిగారు. నేను ఇప్పుడే క్యారెక్టర్‌ ఎక్కా’ అనే డైలాగ్‌ బన్నీ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

                            


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.