టీజర్‌ గ్లింప్స్‌తో బన్నీ అదరగొట్టాడుగా..


యువ కథానాయకుడు అల్లు అర్జున్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ టీజర్‌కు సంబంధించి గ్లింప్స్‌ను విడుదలు చేశాడు. ఇందులో బన్నీ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. లిఫ్ట్‌లో నుంచి బయటకు వస్తూ కోటు ధరించే సన్నివేశం అభిమానుల్ని ఖుషీ చేస్తుంది. అంతేకాదు ఓ సమావేశంలో టేబుల్‌పై నడిచి అక్కడున్న వారినని ఆశ్చర్యానికి గురి చేస్తాడు. విశేషం ఏంటంటే బన్నీ ముఖం కనిపించదు. కేవలం తన హావభావాలతోనే అలరిస్తున్నాడు. టీజర్‌ ఈ నెల 11న సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల కానుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయిక. టబు, సుశాంత్, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

                             


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.