న్యాయం చెప్పడానికి ఇన్నీ సంవత్సరాలు ఎందుకు?

అల్లరి నరేష్‌ పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చే చిత్రం ‘కితకితలు’ ఈ సినిమాలో ఆయన చేసిన అల్లరి హంగామా అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘నాంది’. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంది. ఈరోజు అల్లరి నరేష్‌ పుట్టినరోజు ఈ సందర్బంగా ‘నాంది’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఒకటి విడుదలైంది. ‘‘దేశ‌వ్యాప్తంగా 2015 నాటికి 29 రాష్ట్రాల్లో 1401 జైళ్లు ఉన్నాయి. 3, 66, 781 మంది ఖైదీలు ర‌క‌రాలుగా శిక్ష‌లు అనుభ‌విస్తున్నారు. అందులో దాదాపుగా 2,50,000 త‌ప్పు చేశామో, చేయ్య‌లేదో తెలియ‌కుండా అండ‌ర్ ట్రైల్ ఖైదీలుగా శిక్ష అనుభ‌విస్తున్నారు..’’అంటూ ఈ చిత్రం టీజర్‌ ప్రారంభమై ఆకట్టుకుంటోంది. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిసినిమా టీజర్‌ని విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ఈ టీజర్లో..‘‘మ‌నిషి పుట్ట‌డానికి కూడా తొమ్మిది నెల‌లే టైమ్ ప‌డుతుంది. కానీ నాకు న్యాయం చెప్ప‌డానికేంటి సార్ ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుంది’’ అనే డైలాగ్‌ ప్రతిఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంది. సతీష్‌ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్ ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ లాయర్‌ పాత్రలో నటిస్తుంది. అబ్బూరి రవి మాటలు రాయగా, శ్రీచరణ్‌ పాకాల సంగీతం స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రంలో ప్రియదర్శి, శ్రీకాంత్‌ అయ్యర్‌, ప్రవీణ్‌, హరీష్‌ ఉత్తమన్‌ తదితరులు నటిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.