ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ‘కా’ టీజర్‌

ఆండ్రియా, సలీం గౌస్‌, మరిముత్తు, కమలేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కా’. ‘ది ఫారెస్ట్‌’ అనేది ఉపశీర్షిక. థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఏ సంభాషణలు లేకపోయినప్పటికీ ఉత్కంఠ రేకెత్తిస్తోందీ టీజర్‌. ఓ అడవిలో హత్యలు జరుగుతుంటాయి. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆండ్రియాకి ఆ హత్యలకు కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నేపథ్యం సంగీతం, నటుల హావభావాలతో ఆద్యంతం ఆసక్తి పెంచుతోంది టీజర్‌. నాజిల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్‌ మ్యాక్స్‌ నిర్మించారు. సుందర్‌ సి. బాబు సంగీతం అందించారు.

                                       


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.