అరవింద్‌ స్వామి ‘బోగన్‌’ టైటిల్‌ సాంగ్‌ చూశారా!


అరవింద్‌ స్వామి, జయం రవి, కథానాయకులుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘బోగన్‌’. హన్సిక నాయిక. లక్ష్మణ్‌ దర్శకత్వం వహించారు. అక్కడ మంచి విజయం అందుకున్న ఈ సినిమాను అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు నిర్మాత రామ్‌ తాళ్లూరి ఆరాటపడుతున్నారు. ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెలుగులో ఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన టైటిల్‌ ట్రాక్‌ పాటని విడుదల చేశారు. పాటలో భారీ హంగులతో విజులవ్‌ ట్రీట్‌ ఇవ్వడమే కాకుండా అరవింద్‌ స్వామి ర్యాప్‌సాంగ్‌ అలరిస్తుంది. చిత్రంలో విక్రమ్‌గా జయంరవి ఆదిత్యగా అరవింద్‌ స్వామి కనిపించనున్నారు. డి.ఇమాన్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది. ఈ చిత్రానికి కూర్పు: ఆంటోనీ,ఛాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

                           



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.